5, ఆగస్టు 2025, మంగళవారం

 ICMR-NIE రిక్రూట్‌మెంట్ 2025 తెలుగులో: ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.


అయితే అప్లికేషన్ గడువును పొడిగించడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఆగస్టు 10, 2025.


  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కింద పని చేస్తున్నటువంటి నేషనల్ ఇన్ డిగ్రీ ఫర్ ఎపిడిమోలజీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ICMR-NIE రిక్రూట్‌మెంట్ 2025 ద్వారా అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


  ఈ ICMR-NIE నోటిఫికేషన్ 2025 ద్వారా అసిస్టెంట్ - 1 పోస్టు, అప్పర్ డివిజన్ క్లార్క్ - 2 పోస్టులు, లోయర్ డివిజన్ క్లార్క్ - 7 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


  ఈ ICMR-NIE నోటిఫికేషన్ 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 14, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.


  వయోపరిమితి: 


  అసిస్టెంట్: 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


అప్పర్ డివిజన్ క్లార్క్ & లోయర్ డివిజన్ క్లార్క్: 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


ఫిజికల్ హండిక్యాప్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 13 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15 ఏళ్లు రిలాక్సేషన్ ఉంది.


విద్యార్హత: 


  అసిస్టెంట్: ఏదైనా యూనివర్సిటీ నుండి కనీస 3 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  అలాగే అభ్యర్థులు కంప్యూటర్ పై వర్కింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.


అప్పర్ డివిజన్ క్లర్క్:

  ఏదైనా యూనివర్సిటీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.


  అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి.


లోయర్ డివిజన్ క్లర్క్:


  12వ లేదా ఈక్వేలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  అలాగే అభ్యర్థులకు టైపింగ్ వచ్చి ఉండాలి.


ఎంపిక ప్రక్రియ:


  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మరియు స్కిల్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


ఎలా దరఖాస్తు చేయాలి:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు www.nie.gov.in లేదా www.icmr.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.


  అప్లై చేసుకున్నప్పుడు వాలిడు ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ ఇవ్వాలి.


దరఖాస్తు రుసుము:


  అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 2000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.


  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 16,00 రూపాయలను దరఖాస్తు కింద చెల్లిస్తే సరిపోతుంది.


జీతం:


  అసిస్టెంట్: ఈ ఉద్యోగాలు లెవెల్ 6 ఉద్యోగాలు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే రూ.35400 – 112400 రూపాయల మధ్య శాలరీ ఉంటుంది.


  అప్పర్ డివిజన్ క్లార్క్: ఈ ఉద్యోగం లెవెల్ 4 ఉద్యోగం. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే రూ.25500 - 81100 రూపాయల మధ్య శాలరీ ఉంటుంది.


  లోయర్ డివిజన్ క్లర్క్: ఈ ఉద్యోగాలు లెవెల్ 2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే అభ్యర్థులకు రూ.19900 - 63200 రూపాయల మధ్య శాలరీ వస్తుంది.


అధికారిక వెబ్‌సైట్: Www.nie.gov.in

 www.icmr.gov.in/ ద్వారా

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్