SSC CGL notification 2025 in telugu: ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ విడుదల
SSC CGL notification 2025 in telugu: ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ విడుదల
అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న SSC CGL Notification 2025 విడుదలైంది. ఈ SSC CGL Notification 2025 జూన్ 9వ తేదీన వేదల కావడం జరిగింది. ఈ SSC CGL Notification 2025 ద్వారా గ్రూపు బి మరియు గ్రూప్ సి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే మంచి జీవితం ఉంటుంది.
ఈ SSC CGL Notification 2025 in telugu కోసం అభ్యర్థులు జూన్ 09, 2025వ తేదీ నుండి జూలై 04, 2025వ తేదీ లోపు ఆఫీసియల్ వెబ్సైటు అయిన ssc.gov.in లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్ హండికేప్డ్ అభ్యర్థుల్లో UR అభ్యర్థులకు 10 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
ఎనీ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ SSC CGL Notification 2025 ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు తమ బ్యాచిలర్స్ డిగ్రీని ఆగస్టు 01, 2025 వ తేదీకి కంప్లీట్ చేసి ఉండాలి.
అయితే Junior Statistical Officer మరియు Statistical Investigator Grade-II ఉద్యోగాలకు సపరేట్ క్వాలిఫికేషన్ ఉండాలి.
Junior Statistical Officer: 12th లో మ్యాథ్స్ లో 60% మార్కులతో పాసై, బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
లేదా
డిగ్రీ లో స్టాటిస్టిక్స్ ను ఒక సబ్జెక్టు గా చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Statistical Investigator Grade-II: డిగ్రీ లో స్టాటిస్టిక్స్ ను ఒక సబ్జెక్టు గా చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
Tier - 1 మరియు Tier - 2 ఎగ్జామ్స్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. Tier - 1 ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు 13, 2025 వ తేదీ నుండి ఆగస్టు 30, 2025 వ తేది వరకు షిఫ్ట్ వైజ్ నీర్వహించడం జరుగుతుంది.
Tier - 2 ఎగ్జామ్ ను డిసెంబర్ లో నిర్వహించడం జరుగుతుంది.
Application Fee:
ఈ SSC CGL ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఫిజికల్ హండికాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జులై 05, 2025.
Official Website: ssc.gov.in
లేబుళ్లు: Job Notifications
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి కామెంట్లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్