7, ఆగస్టు 2025, గురువారం

 Sbi Clerk Recruitment 2025: ఏదైనా డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.


  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుండి జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ SBI Clerk Recruitment 2025 ద్వారా 5180 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


  ఈ 5180 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 310 ఉద్యోగాలు మరియు తెలంగాణ లో 250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేటగిరి వయసు పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.


  ఈ Sbi Clerk Recruitment 2025 కోసం అభ్యర్థులు ఆగస్టు 06, 2025 నుండి ఆగస్టు 26, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. 


Age Limit:


  20 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అంటే అభ్యర్థులు ఏప్రిల్ 02, 1997 వ తేదీ నుండి ఏప్రిల్ 01, 2005 వ తేదీ మధ్య పుట్టి ఉండాలి. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ ఏప్రిల్ 01, 2025.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

  ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

  ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 

Educational Qualification: 

  ఏదైనా యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు తమ డిగ్రీని డిసెంబర్ 31, 2025వ తేదీ లోపు కంప్లీట్ చేసి ఉండాలి. 

అయితే అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

Selection Process:

  * ప్రిలిమినరీ ఎగ్జామ్ 
  * మెయిన్ ఎగ్జామ్ 
  * లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ 

Preliminary Examination:

  ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 30 ప్రశ్నలు - 30 మార్కులు - 20 నిమిషాలు 

  న్యూమరికల్ ఎబిలిటీ - 35 ప్రశ్నలు - 35 మార్కులు - 20 నిమిషాలు 

  రీజనింగ్ ఎబిలిటీ - 35 ప్రశ్నలు - 35 మార్కులు - 20 నిమిషాలు 

  ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 60 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ కి సపరేట్ టైమింగ్ కేటాయించడం జరిగింది. ప్రతి తప్పు సమాధానానికి 1/4TH నెగిటివ్ మార్కింగ్ ఉంది. 

 Main Examination:

  ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులను 1:10 రేషియో లో మెయిన్స్ ఎగ్జామ్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 

  ఈ మెయిన్ ఎగ్జామినేషన్ 190 ప్రశ్నలకు గాను 200 మార్కులు చొప్పున 2 గంటల 40 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది.

ప్రతి తప్పు సమాధానానికి 1/4TH నెగిటివ్ మార్కింగ్ ఉంది.


Local Language Test:

  పదవ తరగతి లేదా ఇంటర్లో తెలుగు లాంగ్వేజ్ ను ఒక సబ్జెక్టు కింద చదివిన అభ్యర్థులకు ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్టును నిర్వహించడం జరగదు. మిగతా వారికి ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్టును నిర్వహించడం జరుగుతుంది. 

  అయితే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రానికి కాకుండా వేరే రాష్ట్రానికి అప్లై చేసుకున్నట్లయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. 

Application Fee:

  ఈ Sbi Clerk Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

Examination Centers:

  ఆంధ్ర ప్రదేశ్: అనంతపూర్, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. 

  తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

Salary: 

  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి సిటీలో పోస్టింగ్ వస్తే 46,000 రూపాయల వరకు సాలరీ రావడం జరుగుతుంది.
  

Official Website: www.sbi.co.in

Apply Online: https://www.sbi.co.in/web/careers/current-openings

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్