11, ఆగస్టు 2025, సోమవారం

NIACL Recruitment 2025 In Telugu: ఇన్స్యూరెన్స్ సంస్థలో ఉద్యోగాలు.


థి న్యూ ఇండియా అసురెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) నుండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్ట్ & స్పెషలిస్ట్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ NIACL Recruitment 2025 ద్వారా 550 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 


  ఈ NIACL Recruitment 2025 రిక్రూట్మెంట్ ద్వారా జనరలిస్ట్ - 193 ఉద్యోగాలను, స్పెషలిస్ట్ (రిస్క్ ఇంజనీర్స్-50 పోస్టులు, ఆటో మొబైల్ ఇంజనీర్స్ - 75 పోస్టులు, లీగల్ స్పెషలిస్ట్ - 50 పోస్టులు, అకౌంట్స్ స్పెసిలిస్ట్స్ - 25 పోస్టులు, AO (హెల్త్) - 50 పోస్టులను, ఐటీ స్పెషలిస్ట్ - 25 పోస్టులు, బిజినెస్ అనలిస్ట్ - 75 పోస్టులు, కంపెనీ సెక్రటరీ - 2 పోస్టులను, Actuarial స్పెషలిస్ట్ - 5 పోస్టులను) ఉద్యోగాలను

 మొత్తం గా 550 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


ఈ NIACL Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 07, 2025 వ తేదీ నుండి ఆగస్టు 30, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. 


Age Limit:


  ఆగస్టు 01, 2025 వ తేదీ నాటికి 21 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


అంటే అభ్యర్థులు ఆగస్టు 02, 2025 వ తేదీ నుండి ఆగస్టు 01, 2004 మధ్య పుట్టి ఉండాలి.


ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల మధ్య ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల మధ్య ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


ఫిజికల్ హాండీకేప్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


Educational Qualification:


జనరలిస్ట్:

  ఆగస్టు 01, 2025 వ తేదీ నాటికి గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు 60% మార్కులతో పాసై ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హండికాప్స్ అభ్యర్థులు 55% మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది.)


స్పెషలిస్ట్:


రిస్క్ ఇంజనీర్స్: ఏదైనా డిసిప్లిన్ లో 60% మార్కులతో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.(ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హండికాప్ అభ్యర్థులు 55% మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది.)



ఆటో మొబైల్ ఇంజనీర్స్: బిఈ/బీటెక్/మ్.ఈ/ఎంటెక్ ను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే 60% మార్కులతో పాసై ఉండాలి.


లేదా



ఏదైనా బ్రాంచ్ లో 60%(ఎస్సీ , ఎస్టీ మరియు ఫిజికల్ హండికెప్ - 55%) మార్కులతో ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అలానే ఆటోమొబైల్ లో ఒక సంవత్సరం డిప్లొమా చేసి ఉండాలి.


లీగల్ స్పెషలిస్ట్: లా లో 60% ( ఎస్సీ , ఎస్టీ మరియు ఫిజికల్ హండికాప్ -55%) మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


అకౌంట్స్ స్పెషలిస్ట్: చార్టెడ్ అకౌంటెంట్/కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెట్ మరియు గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ లో 60% (ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హండికాప్ - 55%) మార్కులతో పాసై ఉండాలి.

లేదా


ఎంబీఏ ఫైనాన్స్/PGDM ఫైనాన్స్/MCom లో 60%(ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హండికాప్ - 55%) మార్కులతో పాసై ఉండాలి. 


AO (హెల్త్): ఎంబీబీఎస్/M.D/M.S లేదా పీజీ మెడికల్ డిగ్రీ చేసి ఉండాలి.

లేదా

BDS/MDS చేసి ఉండాలి.

లేదా

BAMS/BHMS చేసి ఉండాలి.


  అభ్యర్థులు పైన వాటిలో 60%(ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హండికాప్ - 5) మార్కులతో పాసై ఉండాలి.


లేదా


ఈక్వాలెన్ట్ ఫారిన్ డిగ్రీస్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


ఐటీ స్పెషలిస్ట్: బి ఈ/బీటెక్/ఎం ఈ/ఎంటెక్ లో ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ డిసిప్లిన్ లో చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

లేదా

MCA చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


పైన తెలిపిన అర్హతలలో అభ్యర్థులు 60%(ఎస్సీ , ఎస్టీ మరియు ఫిజికల్ హండికాప్ - 55%) మార్కులతో పాసై ఉండాలి.


బిజినెస్ అనలిస్ట్: స్టాటిస్టిక్స్/మాథెమాటిక్స్/అక్చరియల్ సైన్స్/డేటా సైన్స్/బిజినెస్ అనలిస్ట్ లో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు 60%(ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ హండికప్ - 55%) మార్కులతో పాసై ఉండాలి. 

కంపెనీ సెక్రటరీ: ACS/FCS From ICSI మరియు గ్ర్డ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ లో 60%(ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ హండికాప్ - 55%) మార్కులతో పాసై ఉండాలి.


ACTUARIAL స్పెషలిస్ట్: గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ ను 60%(ఎస్సీ , ఎస్టీ మరియు ఫిజికల్ హండికప్ - 55%) మార్కులతో కంప్లీట్ చేసి ఉండాలి. And 

Cleared minimum four Actuarial papers from IAI

or IFoA necessarily including CM1 and not

including CB3

and be an active member of IFoA or IAI 


Selection Process:


* ప్రిలిమినరీ ఎగ్జామినేషన్

* మెయిన్ ఎగ్జామినేషన్

* ఇంటర్వ్యూ

ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను సెప్టెంబర్ 14, 2025 వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. 


  మెయిన్స్ పరీక్ష ను అక్టోబర్ 29, 2025 వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. 


Examination Centers:


ఆంధ్రప్రదేశ్:

ప్రిలిమ్స్: గుంటూరు/విజయవాడ, కాకినాడ, కర్నూలు,నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి,విశాఖపట్నం, విజయనగరం,అనంతపూర్, కడప.


మెయిన్స్: విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం



తెలంగాణ:


ప్రిలిమ్స్: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్. 


మెయిన్స్: హైదరాబాదు.


Application Fee:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు 850 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.


ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హాండికెప్ అభ్యర్థులు 100 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

How To Apply:


  అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం www.newindia.co.in వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి. 

ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ చెల్లించాలి. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.


Official Website: www.newindia.co.in

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్