15, ఆగస్టు 2025, శుక్రవారం

 Central Railway Apprentice Recruitment 2025: ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు.

ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు అయితే కావు. కాబట్టి ఇంట్రెస్ట్ కాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి.

  రైల్వే శాఖలో అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ Central Railway Apprentice Recruitment 2025 ద్వారా 2418 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఆగస్టు 12, 2025 వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు.


  ఈ Central Railway Apprentice Recruitment 2025 ద్వారా ఫిట్టర్, వేల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మచినిస్ట్, డీజిల్ మెకానిక్, టర్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, లేబరేటరీ అసిస్టెంట్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రాంగ్రం అసిస్టెంట్ పలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


  ఈ Central Railway Apprentice Recruitment 2025 ఉద్యోగాలను ముంబై, పూణే, నాగపూర్, సోలాపూర్, భూస్వాల్ క్లస్టర్లలో భర్తీ చేస్తున్నారు.


  ఈ Central Railway Apprentice Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 12, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 11, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


  Age Limit:


  ఆగస్టు 12, 2025 వ తేదీ నాటికి 15 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. అంటే అభ్యర్థులు ఆగస్టు 12, 2001 వ తేదీ నుండి ఆగస్టు 12, 2010 వ తేదీ మధ్య పుట్టి ఉండాలి.


ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే అభ్యర్థులు ఆగస్టు 12, 1996 వ తేదీ నుండి ఆగస్టు 12, 2010 వ తేదీ మధ్య పుట్టి ఉండాలి.


  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే అభ్యర్థులు ఆగస్టు 12, 1998 వ తేదీ నుండి ఆగస్టు 12, 2010 వ తేదీ మధ్య పుట్టి ఉండాలి.


ఫిజికల్ హండికప్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


Educational Qualification:


  10 వ తరగతి లేదా ఈక్వేలెంట్ట్ లో 55% మార్కులతో పాసై, ఐటిఐ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. రెలవెంట్ ట్రేడ్ ను బట్టి అప్లై చేసుకోండి.



Selection Process:


మెరిట్ లిస్టు ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి మరియు ఐటిఐ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


Application Fee: 


 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 


  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మరియు ఫిజికల్ హండికప్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.


Official Website: www.rrccr.com 



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్