19, ఆగస్టు 2025, మంగళవారం

 Appeal For NTR Bharosa Pension: వైకల్యం పెన్షన్లకు అప్పీలు పెట్టుకోండి. 


Appeal For NTR Bharosa Pension:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకల్య నూతన సదరం సర్టిఫికెట్లకు సంబంధించి మీ పర్సంటేజ్ తగ్గిందా. 40 శాతం కన్నా మీ వైకల్యం పర్సంటేజ్ తక్కువ ఉందా. అయితే ఈ విధంగా NTR Bharosa Pension కు Appeal చేసుకోండి. మీ NTR Bharosa Pension ను తిరిగి పొందండి.


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తర్వాత, బోగస్ పింఛన్లను తీసివేయాలని నిర్ణయించుకుంది. అనుకున్న విధంగానే రాష్ట్రంలోని వైకల్య పెన్షన్లను రీ వెరిఫికేషన్ చేసింది. రీ వెరిఫికేషన్ చేసిన కొత్త సదరన్ సర్టిఫికెట్లను అభ్యర్థులకు సచివాలయంలో అందిస్తున్నారు. 


  అయితే ఈ కొత్త సదరం సర్టిఫికెట్లలో చాలామందికి పర్సంటేజ్ తగ్గడం జరిగింది. చాలామందికి పెన్షన్లు రద్దు కానున్నాయి. సెప్టెంబర్ నెల నుండి చాలామందికి పెన్షన్లు రాకపోవచ్చు.


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైకల్యం పర్సంటేజ్ ను బట్టి పెన్షన్లను ఇవ్వనుంది.


DMHO Pensions: పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారునికి నెలకు 15,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. (ఉదా: పెరాలసిస్, యాక్సిడెంట్). ఇటువంటి వారికి ఈ పెన్షన్ రావాలి అంటే 80% కన్నా ఎక్కువ వైకల్యం పర్సంటేజ్ ఉండాలి.

  

6000 రూపాయల పెన్షన్ రావాలి అంటే వైకల్యం పర్సంటేజ్ 40% నుండి 85% మధ్య ఉండాలి. 


  ఎవరికైతే 40 శాతం కన్నా తక్కువ వైకల్యం పర్సంటేజ్ ఉందో అటువంటి వారికి ఇక నుండి పెన్షన్ రద్దు అవ్వనుంది.

 అయితే 40 శాతం కన్నా తక్కువ పర్సంటేజ్ ను కలిగి 60 సంవత్సరాలకు పైబడిన వారికి వృద్ధాప్య పెన్షన్ 4000 రూపాయలను అందజేయడం జరుగుతుంది. ఈ 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ రావాలి అంటే ఆ కుటుంబంలో ఇంకెవరు పెన్షన్ పొందుతూ ఉండకూడదు.


  ఇప్పుడు ప్రస్తుతం సచివాలయంలో పెన్షన్లు రద్దు అయిన వారికి నోటీసులు ఇస్తున్నారు. ఈ నోటీసులను ఆగస్టు 15 నుండి ఆగస్టు 25వ తేదీ వరకు ఇవ్వనున్నారు.

నాకు వైకల్యం పర్సంటేజ్ తగ్గింది లేదా వైకల్యం పర్సంటేజ్ ను 40 శాతం కన్నా తక్కువ వేశారు. మేము ఎక్కువ వైకల్యాన్ని కలిగి ఉన్నాం అనేవారు ఈ విధంగా NTR Bharosa Pension కి Appeal చేసుకోండి. 


Appeal For NTR Bharosa Pension:


  అనర్హులని నోటీసులు అందుకున్న వారు. ఈ విధంగా AP NTR Bharosa Pension కి Appeal పెట్టుకోండి.

  మీ సమీప మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) లేదా మున్సిపల్ కమిషనర్ను సందర్శించి అర్జీ పెట్టుకోండి. అధికారులు మీ అర్జీని పెన్షన్ పోర్టల్ లో అప్లోడ్ చేసి, తదుపరి కార్యాచరణ జరిపిస్తారు. 

  తరువాత మిమ్మల్ని ఆసుపత్రికి హాజరు కావాలి అని కోరుతూ నోటీసు జారీ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడ అనే సమాచారం నోటీసు ద్వారా మీకు తెలియజేస్తారు.. 

 ఇతర వివరాలకు గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించండి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్