17, ఆగస్టు 2025, ఆదివారం

 CSIR-IICT Recruitment 2025: పదవ తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు. 




  కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పని చేస్తున్నటువంటి ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CSIR-IICT Recruitment 2025 ద్వారా జూనియర్ స్టేనోగ్రాఫర్ మరియు ఎంటీఎస్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.


  ఈ CSIR-IICT Recruitment 2025 ద్వారా జూనియర్ స్టెనోగ్రాఫర్ - 1 (ఎస్టీ) మరియు ఎంటిఎస్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) - 8 (UR - 03, EWS - 1, ఓబీసీ - 2, ఎస్సీ - 1, ఎస్టీ - 1) పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 

  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే పోస్టింగ్ హైదరాబాదులోనే ఉంటుంది.


  ఈ CSIR-IICT Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 14, 2025 వ తేది ఉదయం 9 గంటల నుండి సెప్టెంబర్ 12, 2025వ తేదీ రాత్రి 11:59 గంటల లోపు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. 


Age Limit: 


జూనియర్ స్టెనోగ్రాఫర్: 

 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


ఎం టి ఎస్: 

  18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్స్యేషన్ ఉంది.


ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.


Educational Qualification: 


ఎంటిఎస్: 

  పదవ తరగతి పాసైన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


జూనియర్ స్టెనోగ్రాఫర్: 

  10+2/XII లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  అలాగే ఇంగ్లీష్/హిందీ లో స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి.


Selection Process:


ఎంటిఎస్: 


  ఈ ఎంటిఎస్ ఉద్యోగాలను ఆఫీసు మెయింటెనెన్స్, హాస్పిటాలిటి సర్వీసెస్, హార్టికల్చర్/హౌస్ కీపింగ్, ట్రాన్స్పోర్ట్ సర్వీసుల కోసం ఎంపిక చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్లను స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఈ ట్రేడ్ టెస్ట్ లో పాస్ అయిన అభ్యర్థులకు కంప్యూటర్ రిటన్ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. 


 కంప్యూటర్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ రూపంలో ఉంటుంది. పదవ తరగతి లెవెల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. 


జనరల్ ఇంటెలిజెన్స్ - 25 ప్రశ్నలు - 75 మార్కులు 


జనరల్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు - 75 మార్కులు 


జనరల్ అవేర్నెస్ - 50 ప్రశ్నలు - 150 మార్కులు 


ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 50 ప్రశ్నలు - 150 మార్కులు 


ఎగ్జామ్ అనేది 150 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు చొప్పున 450 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. రెండు గంటల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు నెగిటివ్ ఉంది.


ఎగ్జామ్ పేపర్ అనేది తెలుగులో కూడా ఉంటుంది.


జూనియర్ స్టేనోగ్రాఫర్:


ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్లను స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.


  కంప్యూటర్ రిటన్ ఎగ్జామ్ మరియు ప్రొఫెషియన్సీ ఇన్ స్టెనోగ్రాఫర్ నిర్వహించి ఈ ఉద్యోగం ను భర్తీ చేస్తూ ఉన్నారు.


  200 ప్రశ్నలకు గాను 200 మార్కులు చొప్పున 2 గంటల పాటు కంప్యూటర్ రిటన్ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 


  తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రాఫర్ ను నిర్వహించడం జరుగుతుంది. పది నిమిషాల పాటు ఈ టెస్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ టెస్టులో క్వాలిఫై అయితే సరిపోతుంది. మెరిట్ లిస్టును కంప్యూటర్ రిటన్ ఎగ్జామినేషన్ నుండి తీయడం జరుగుతుంది.


Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హండికాప్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. 


Salary: 


జూనియర్ స్టెనోగ్రాఫర్:

  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే 52,755 రూపాయలు శాలరీ రావడం జరుగుతుంది.


ఎంటీఎస్: 

  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే 35,393 రూపాయలు సాలరీ ఉంటుంది.


Official Website: https://www.iict.res.in/careers. 



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్